బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 19:05:18

DCvSRH: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

DCvSRH: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో  వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌,  ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ  ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యా్‌చ్‌ జరుగుతోంది.  హ్యాట్రిక్‌ విజయం సాధించాలని ఢిల్లీ  ఉత్సాహంతో  ఉండగా టోర్నీలో బోణీ చేయాలని సన్‌రైజర్స్‌ పట్టుదలతో ఉన్నది.  అబుదాబి వేదికగా జరిగే  పోరులో ఎలాగైనా ఢిల్లీని ఓడించి పాయింట్ల ఖాతా తెరువాలని డేవిడ్‌ వార్నర్‌సేన  పట్టుదలతో  కనిపిస్తున్నది.

టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌  శర్మ తుది జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌ జట్టులో  రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.  ఫిట్‌నెస్‌ సాధించిన కేన్‌ విలియమ్సన్‌ ఎట్టకేలకు ఇవాళ మ్యాచ్‌ ఆడుతున్నాడు. వృద్ధిమాన్‌ సాహా స్థానంలో అబ్దుల్‌ సమద్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.