ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 19:03:08

KXIP vs DC: బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్‌

KXIP vs DC: బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రేయస్‌ అయ్యర్‌

దుబాయ్:‌ ఐపీఎల్‌-13లో భాగంగా దుబాయ్‌ వేదికగా శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌..కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి.  పాయింట్ల పట్టికలో ఏడు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూడు విక్టరీలతో పంజాబ్‌ ఏడో స్థానంలో ఉంది.  టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

గాయాల నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్‌, హెట్‌మైర్‌, డేనియల్‌ శామ్స్‌ తుది జట్టులోకి వచ్చినట్లు అయ్యర్‌ చెప్పాడు.  జోర్డాన్‌ స్థానంలో జేమ్స్‌ నీషమ్‌ను తీసుకున్నట్లు రాహుల్‌ వెల్లడించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై  ఢిల్లీ   సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.