శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 11, 2020 , 19:03:38

IPL 2020: హిట్టర్ల పోరు..గెలుపెవరిదో?

IPL 2020: హిట్టర్ల పోరు..గెలుపెవరిదో?

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజ‌లో  ఆదివారం రాత్రి మరో ఆసక్తికర పోరు ఆరంభమైంది.  ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌   జట్లు  అబుదాబి  వేదికగా తలపడుతున్నాయి.  టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.  రిషబ్‌ పంత్‌ స్థానంలో రహానె..హెట్‌మైర్‌ స్థానంలో అలెక్స్‌ కేరీ తుది జట్టులోకి వచ్చారు.  రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. 

బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో  సీనియర్‌, యువ ఆటగాళ్ల కలయికతో  ఢిల్లీ  జట్టు సమతూకంతో ఉంది.  రోహిత్‌ శర్మ సారథ్యంలోని   ముంబై   ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది.   హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌   కీలక సమయంలో బ్యాట్‌ ఝుళిపిస్తే  ఢిల్లీకి  కష్టాలు తప్పవు. అలాగే, ఢిల్లీ జట్టులోనూ లోయర్‌ ఆర్డర్‌లో   స్టోయినీస్‌ మెరుపు  బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.   రెండు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ ఉండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది.