మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 11:57:03

ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో మాట్లాడిన ఆ న‌ర్స్ ఎవ‌రు?

ఇండియ‌న్ క్రికెట‌ర్‌తో మాట్లాడిన ఆ న‌ర్స్ ఎవ‌రు?

న్యూఢిల్లీ: ఐపీఎల్ సంద‌ర్భంగా ఓ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌ను ఢిల్లీకి చెందిన ఓ న‌ర్స్‌ మ్యాచ్‌కు సంబంధించిన వివ‌రాలు అడిగిందంటూ వ‌చ్చిన వార్త‌లు క‌ల‌క‌లం రేపాయి. తాను బెట్టింగ్‌లో డ‌బ్బులు పెట్ట‌డం కోస‌మే ఈ వివ‌రాలు అడుగుతున్న‌ట్లు కూడా ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. సెప్టెంబ‌ర్ 30న ఐపీఎల్ టోర్నీ మ‌ధ్య‌లో ఉన్న స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా స‌ద‌రు న‌ర్స్‌.. ఆ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌ను సంప్ర‌దించింది. అయితే మ్యాచ్ వివ‌రాలు చెప్ప‌డానికి నిరాక‌రించిన ఆ ప్లేయ‌ర్‌.. ఇలాంటి వివ‌రాలు అడ‌గ‌కూడ‌ద‌ని, తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. ఆ త‌ర్వాత ఇదే విష‌యాన్ని బీసీసీఐకి కూడా చెప్పాడు. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప‌త్రిక ఈ ఘ‌ట‌న గురించి బ‌య‌ట‌పెట్టింది.

విచార‌ణ‌లో ఏం తేలింది?

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే విచార‌ణ కూడా పూర్త‌యిన‌ట్లు బీసీసీఐ అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే విచార‌ణ‌లో ఏమీ తేల‌క‌పోవ‌డంతో దానిని ముగించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఐపీఎల్ స‌మ‌యంలోనే స‌ద‌రు ప్లేయ‌ర్ ఈ ఘ‌ట‌న గురించి మాకు చెప్పాడు. మేము విచార‌ణ జ‌రిపాం. ఆ న‌ర్స్ తాను ఓ డాక్ట‌ర్‌ని అంటూ ఆ ప్లేయ‌ర్‌ను సంప్ర‌దించింది. ఆమె ప్రొఫెష‌న‌ల్ బుకీ కాద‌ని తేలింది. ఆమెకు ఆ ప్లేయ‌ర్ ముందే తెలుసు. విచార‌ణ‌లో భాగంగా ఆ న‌ర్స్‌ను కూడా పిలిచి ప్రశ్నించాం. కానీ ఆమె నుంచి ఎలాంటి స‌మాచారం ల‌భించలేదు. దీంతో విచార‌ణ ముగించాం అని అజిత్ సింగ్ చెప్పారు. 

మూడేళ్ల కింద‌టే ప‌రిచ‌యం

ఆ ఇండియ‌న్ క్రికెట‌ర్‌కు ఈ న‌ర్స్ మూడేళ్ల కింద‌టే ఆన్‌లైన్‌లో ప‌రిచ‌య‌మైన‌ట్లు కూడా ఈ విచార‌ణ‌లో తేలింది. తాను ఢిల్లీకి చెందిన ఓ డాక్ట‌ర్‌ని అని, మీ అభిమానిని అంటూ క్రికెట‌ర్‌తో ప‌రిచ‌యం పెంచుకున్న‌ద‌ని తెలిసింది. ఆ త‌ర్వాత కూడా కొవిడ్‌-19కు సంబంధించి ఆమె స‌ల‌హాలు తీసుకోవ‌డానికి ఆ క్రికెట‌ర్ ఆమెతో ఆన్‌లైన్‌లో ట‌చ్‌లో ఉన్నాడు. అయితే తానెప్పుడూ ఆమెను నేరుగా క‌ల‌వ‌లేద‌ని అత‌డు స్ప‌ష్టం చేశాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

ఆ డీల్ ఆప‌క‌పోయారో.. ఇండియాకు అమెరికా వార్నింగ్‌

కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..

కేఎల్ రాహుల్‌కు గాయం.. ఆసీస్ నుంచి వెన‌క్కి