శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 01:56:54

ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ శుభారంభం

ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ శుభారంభం

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నీలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ శుభారంభం చేశాయి. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో ఉత్తర్‌ప్రదేశ్‌పై విజయం సాధించింది. తొలుత అశ్రిత్‌ (32), అరోలిప్‌ (16) రాణింపుతో ఢిల్లీ 7 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూపీ జట్టు 7 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులకు పరిమితమైంది. రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ 78 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌పై ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యఛేదనలో కశ్మీర్‌ 7 ఓవర్లలో 4 వికెట్లకు 70 పరుగులు చేసింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవంలో అండర్‌-19 క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పాపిరెడ్డి, టోర్నీ నిర్వాహకుడు సురేశ్‌ కుమార్‌, విశాల్‌ పాఠక్‌, ఆనంద్‌, జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు అశోక్‌, కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo