శనివారం 28 మార్చి 2020
Sports - Jan 22, 2020 , 04:21:01

రెండో రౌండ్‌లో నిఖత్‌

రెండో రౌండ్‌లో నిఖత్‌


న్యూఢిల్లీ: స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల 51కిలోల బౌట్‌లో బరిలోకి దిగిన నిఖత్‌ 5-0 తేడాతో యాస్మైన్‌ మౌటకీ(మొరాకో)పై అలవోక విజయం సాధించింది. పదునైన పంచ్‌లకు తోడు జాబ్స్‌, హుక్స్‌తో చెలరేగిన ఈ హైదరాబాదీ బాక్సర్‌..ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. తనదైన జోరు కనబరుస్తూ పంచ్‌లతో విరుచుకుపడింది. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్తు కోసం మేరీకోమ్‌ తలపడిన తర్వాత జరీన్‌ బరిలోకి దిగిన తొలి బౌట్‌ ఇది. పురుషుల విభాగంలో స్టార్‌ బాక్సర్‌ శివ తాపా (63 కేజీలు)కు బై  లభించింది. 


logo