ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 07, 2020 , 00:48:02

ఆదుకున్న రహానే, పుజార

ఆదుకున్న రహానే, పుజార

అజేయ శతకంతో అదరగొట్టిన అజింక్య 

భారత్‌-ఏ 237/8

సిడ్నీ: కెప్టెన్‌ అజింక్య రహానే (108 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రాణించడం సహా చతేశ్వర్‌ పుజార (54) అర్ధసెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా-ఏతో సన్నాహక మ్యాచ్‌లో భారత్‌-ఏ నిలదొక్కుకుంది. ఆదివారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. రహానేతో పాటు సిరాజ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆరంభంలోనే యువ ఓపెనర్లు పృథ్వీ షా (0), శుభమన్‌ గిల్‌ (0) ఖాతా తెరువకుండానే ఔట్‌ కాగా.. విహారి (15) విఫలమవడంతో భార త్‌ 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో చతేశ్వర్‌ పుజార, రహానే మ్యాచ్‌ను నిలబెట్టారు.  అర్ధ శతకం తర్వాత పుజార.. అనంతరం సాహా (0), అశ్విన్‌ (5) వెనువెంటనే ఔటై నా రహానే పోరాటాన్ని కొనసాగించాడు. కుల్దీప్‌  (15), ఉమేశ్‌ (24) సహకారంతో విలువైన భాగస్వామ్యాలను నమోదు చేసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో 16 ఫోర్లు, ఓ సిక్స్‌తో రహానే శతకం పూర్తిచేసుకున్నాడు. 


logo