టోక్యో : టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లర్ దీపక్ పూనియా ( Deepak Punia ).. సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. 86కేజీల ఈవెంట్లో అమెరికా రెజ్లర్ డేవిడ్ మోరిస్ టేలర్ చేతిలో దీపక్ ఖంగుతిన్నాడు. టెక్నికల్ సుపీరియార్టీ పద్ధతిలో టేలర్ 10-0 స్కోర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెజ్లర్ దీపక్.. బ్రాంజ్ మెడల్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆరంభం నుంచి అమెరికా రెజ్లర్ టేలర్ దూకుడుగా ఆడాడు. దీపక్‌ను ఓ పట్టుపట్టేశాడతను. మరింత యాక్టివ్‌గా కావాలటూ దీపక్‌ను రెఫరీ కోరాడు. ఆ సమయంలో ఇన్‌యాక్టివ్ క్లాక్‌తో పాయింట్లను దీపక్ కోల్పోయాడు. ఆ తర్వాత టేలర్.. దీపక్‌ను గట్టిగా పట్టి కిందపడేశాడు. దీంతో అమెరికా రెజ్లర్ లీడింగ్‌లోకి వెళ్లిపోయాడు. ఇవాళ ఉదయం జరిగిన రెండు మ్యాచుల్లో దీపక్ పూనియా విజయం సాధించిన తీరు ఆకట్టుకున్నా.. సెమీస్‌లో మాత్రం అతని పట్టు నిలువలేకపోయింది.