e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home స్పోర్ట్స్ చాహర్‌ చమక్‌..

చాహర్‌ చమక్‌..

చాహర్‌ చమక్‌..
  • చెన్నైని గెలిపించిన దీపక్‌..
  • పంజాబ్‌పై విజయంతో ధోనీసేన బోణీ

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పిచ్‌ను పరిశీలించి వచ్చాక దీపక్‌ చాహర్‌ చేతికి బంతిని అందిస్తూ చిరు దరహాసం చేశాడు. పిచ్‌ స్వింగ్‌కు సహకరిస్తుందని ముందే అంచనా వేసిన మాస్టర్‌ మైండ్‌ మహీ.. దీపక్‌ చాహర్‌తో వరుసగా నాలుగు ఓవర్లు వేయించి ఫలితం రాబట్టాడు. దీపక్‌ స్వింగ్‌కు.. జడ్డూ ఫీల్డింగ్‌ తోడవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్‌.. బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్‌ చేయలేక పరాజయం వైపు నిలిచింది.ముంబై: గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చెన్నై ఈ సారి జూలు విదిల్చింది. దీపక్‌ చాహర్‌ (4/13) అద్భుత బౌలింగ్‌కు జడేజా అదిరిపోయే ఫీల్డింగ్‌ తోడవడంతో ధోనీ సేన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బోణీ కొట్టింది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. స్టార్లు విఫలమైన చోట షారుక్‌ ఖాన్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం లక్ష్యఛేదనలో మొయిన్‌ అలీ (31 బంతుల్లో 46; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), డుప్లెసిస్‌ (36 నాటౌట్‌) రాణించడంతో చెన్నై 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

దీపక్‌ కమాల్‌..
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మయాంక్‌ (0)ను ఔట్‌ చేసిన చాహర్‌.. తన మూడో ఓవర్‌లో గేల్‌ (10), పూరన్‌ (0)ను ఖాతాలో వేసుకున్నాడు. మధ్యలో కెప్టెన్‌ రాహుల్‌ (5).. జడ్డూ విసిరిన అద్భుత త్రోకు రనౌట్‌ కాగా.. తన చివరి ఓవర్‌లో హుడా (10)ను కూడా చాహర్‌ ఔట్‌ చేశాడు. ఫలితంగా 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ 26/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిచర్డ్‌సన్‌ (15) అండతో కొన్ని చక్కటి షాట్లు ఆడిన షారుక్‌ ఖాన్‌ జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు.

ఆడుతూ పాడుతూ..
సాధించాల్సిన పరుగులు ఎక్కువగా లేకపోవడంతో చెన్నై ఆడుతూ పాడుతూ టార్గెట్‌ ఛేజ్‌ చేసింది. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (5) ఆకట్టుకోలేకపోయినా.. డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ నిలకడగా ఆడారు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 64/1తో నిలిచింది. అర్ధశతకానికి చేరువైన అలీ భారీషాట్‌కు యత్నించి ఔట్‌ కాగా.. షమీ వరుస బంతుల్లో రైనా (8), రాయుడు (0)ను ఔట్‌ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.

వారెవ్వా జడ్డూ..
అంతర్జాతీయ క్రికెట్‌లో తనను అత్యుత్తమ ఫీల్డర్‌ అని ఎందుకు అంటారో జడ్డూ మరోసారి నిరూపించుకున్నాడు. దీపక్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతి గేల్‌ ప్యాడ్‌లను తాకడంతో ఎల్బీ కోసం అప్పీల్‌ చేయగా.. అదే సమయంలో నాన్‌స్ట్రయికింగ్‌లో ఉన్న రాహుల్‌ సింగిల్‌ తీయాలనుకొని ముందుకు వచ్చాడు. షార్ట్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా మెరుపు వేగంతో వికెట్లకు గురిపెట్టడంతో రాహుల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. రెండు ఓవర్ల తర్వాత గేల్‌ క్యాచ్‌ను జడేజా కండ్లు చెదిరే రీతిలో పట్టి శభాష్‌ అనిపించుకున్నాడు. ఆఖర్లో ధాటిగా ఆడుతున్న షారుక్‌ ఖాన్‌ను కూడా జడేజా సూపర్‌ క్యాచ్‌ ద్వారా పెవిలియన్‌ పంపడం గమనార్హం.

స్కోరు బోర్డు
పంజాబ్‌:
రాహుల్‌ (రనౌట్‌/జడేజా) 5, మయాంక్‌ (బి) దీపక్‌ 0, గేల్‌ (సి) జడేజా (బి) దీపక్‌ 10, హుడా (సి) డుప్లెసిస్‌ (బి) దీపక్‌ 10, పూరన్‌ (సి) శార్దూల్‌ (బి) దీపక్‌ 0, షారుక్‌ ఖాన్‌ (సి) జడేజా (బి) సామ్‌ కరన్‌ 47, రిచర్డ్‌సన్‌ (బి) అలీ 15, మురుగన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) బ్రేవో 6, షమీ (నాటౌట్‌) 9, మెరెడిత్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 106/8. వికెట్ల పతనం: 1-1, 2-15, 3-19, 4-19, 5-26, 6-57, 7-87, 8-101, బౌలింగ్‌: దీపక్‌ 4-1-13-4, సామ్‌ కరన్‌ 3-0-12-1, శార్దూల్‌ 4-0-35-0, జడేజా 4-0-19-0, అలీ 3-0-17-1, బ్రేవో 2-0-10-1.

చెన్నై: గైక్వాడ్‌ (సి) హుడా (బి) అర్శ్‌దీప్‌ 5, డుప్లెసిస్‌ (నాటౌట్‌) 36, అలీ (సి) షారుక్‌ ఖాన్‌ (బి) మురుగన్‌ 46, రైనా (సి) రాహుల్‌ (బి) షమీ 8, రాయుడు (సి) పూరన్‌ (బి) షమీ 0, సామ్‌ కరన్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 15.4 ఓవర్లలో 107/4. వికెట్ల పతనం: 1-24, 2-90, 3-99, 4-99, బౌలింగ్‌: షమీ 4-0-21-2, రిచర్డ్‌సన్‌ 3-0-21-0, అర్శ్‌దీప్‌ 2-0-7-1, మెరెడిత్‌ 3.4-0-21-0, మురుగన్‌ 3-0-32-1.

ఇవీ కూడా చదవండీ…

ధాన్యం కొనుగోలుకు 194 కేంద్రాలు

గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!

దివ్యాంగుల పరికరాలకు ప్రత్యేక పార్క్‌

Advertisement
చాహర్‌ చమక్‌..
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement