సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 02, 2020 , 20:01:25

CSK vs SRH: సన్‌రైజర్స్‌కు షాక్‌..బెయిర్‌స్టో డకౌట్‌

CSK vs SRH: సన్‌రైజర్స్‌కు షాక్‌..బెయిర్‌స్టో డకౌట్‌

దుబాయ్‌:చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ  తగిలింది. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్‌ బెయిర్‌స్టో(0: 3 బంతుల్లో)  వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే   బెయిర్‌స్టో  పెవిలియన్‌ చేరాడు. 

వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. ప్రతీ ఓవర్‌లో కనీసం ఒక ఫోర్‌ బాదుతూ రన్‌రేట్‌  పడిపోకుండా చూస్తున్నాడు.  మరో ఎండ్‌లో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ పాండేకు సహకారం అందిస్తున్నాడు.  పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. పాండే(27), వార్నర్‌(13) క్రీజులో ఉన్నారు.  చెన్నై పేసర్లు షార్దుల్‌ ఠాకూర్‌,  దీపక్‌ చాహర్‌ కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు.