ఐపీఎల్‌కు ప్రేక్షకుల అనుమతిపై త్వరలో నిర్ణయం: గంగూలీ

కోల్‌కతా : ఈ నెల 24 న అహ్మదాబాద్‌లో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌కు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ప్రేక్షకులు తిరిగి స్టేడియంలకు రావడంతో క్రికెట్లో మళ్లీ మునుపటి కళ కనిపించనున్నది. దీంతో ఏప్రిల్ రెండవ వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్లో ప్రేక్షకులను అనుమతించడాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనమతించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గంగూలీ పేర్కొన్నారు. ఈ ఏడాది చాలా మ్యాచులు ఆడాల్సి ఉన్నదని, ప్రేక్షకులను ఐపీఎల్‌కు తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని గంగూలీ చెప్పారు. అహ్మదాబాద్ టెస్ట్‌కు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడు పోయాయని, వాతావరణం తిరిగి సాధారణస్థితికి చేరుకోవడం సంతోషకరంగా ఉన్నదన్నారు.
గురువారం జరుగనున్న ఐపీఎల్ మినీ వేలం గురించి గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది పెద్ద వేలం కాదు. కానీ చాలా జట్లు ఆటగాళ్లతో పూరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు వేలంలో పాల్గొని ఆటగాళ్లను తీసుకోవాల్సిన పని చాలా ఉంటుంది’ అని గంగూలీ పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి హోమ్ సిరీస్‌లో పింక్ బాల్ టెస్ట్ శాశ్వతంగా ఉంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి మాట్లాడిన గంగూలీ.. రెండు రౌండ్ల యాంజియోప్లాస్టీ చేయించుకున్నానని, ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉన్నానని, అందుకే తిరిగి పనిలోకి వెంటనే రాగలిగానని వెల్లడించారు.
అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియం టెస్ట్ మ్యాచుకు సిద్ధమైంది. ఏడేండ్ల తర్వాత అహ్మదాబాద్‌లో క్రికెట్ తిరిగి ఆడేందుకు సిద్ధం అవడంతో అక్కడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక
- అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐపీఎస్ దంపతులు
- వాలంటీర్లపై ఎస్ఈసీ ఆంక్షలు
- అల్లం రసాన్ని మనం రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?
- ప్రియావారియర్ కు ఫస్ట్ మూవీనే ‘చెక్’ పెట్టిందా..!