మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 03, 2020 , 22:58:24

'టీ20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరగొచ్చు'

'టీ20 ప్రపంచకప్‌ న్యూజిలాండ్‌లో జరగొచ్చు'

సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర సందిగ్ధంలో పడింది. టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ సరికొత్త ప్రతిపాదన తెచ్చాడు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగొచ్చని బుధవారం ట్వీట్‌ చేశాడు.

న్యూజిలాండ్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం సహా 12రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. దీంతో కొత్త కేసులు రాకపోతే వచ్చే వారం నుంచి ప్రజలు గుమికూడేందుకు కూడా అనుమతిస్తామని ఆ దేశ ప్రధాని జెసిండా అడెర్న్‌ ఇటీవల చెప్పారు.  ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న న్యూజిలాండ్‌లో టోర్నీ జరుగొచ్చని జోన్స్‌ అభిప్రాయపడ్డాడు. 'వచ్చే వారం అలెర్ట్‌ లెవెల్‌-1కు న్యూజిలాండ్‌ వెళ్లొచ్చని జెసిండా(ప్రధాని) చెప్పారు. దీంతో భౌతిక దూరం నిబంధనలతో పాటు జన సమూహాలపై విధించిన నిషేధం కూడా తొలగిపోతుందని చెప్పారు. అక్కడ టీ20 ప్రపంచకప్‌ జరుగొచ్చు?' అని జోన్స్‌ బుధవారం ట్వీట్‌ చేశాడు. 

 


logo