సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 28, 2020 , 22:01:19

MI vs RCB: డికాక్, ఇషాన్‌ ఔట్‌

MI vs RCB: డికాక్, ఇషాన్‌ ఔట్‌

అబుదాబి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్లో క్వింటన్‌ డికాక్‌(18) ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడటంతో పవర్‌ప్లే ఆఖరికి  ముంబై 45/1తో నిలిచింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో ముంబై బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తున్నారు. 

యువ స్పిన్నర్‌ చాహల్ వేసిన 8వ ఓవర్లో ఫామ్‌లో ఉన్న ఇషాన్‌(25)..క్రిస్‌ మోరీస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా  ఉండటంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌(8), సౌరభ్‌ తివారీ(0) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు ముంబై 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.