ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 09, 2020 , 14:12:13

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లో ఇద్దరే

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్-10లో ఇద్దరే

దుబాయ్‌:  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో  ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌(877 రేటింగ్‌ పాయింట్లు) నంబర్‌వన్‌ స్థానాన్ని  దక్కించుకున్నాడు.  ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన మలన్‌ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరచుకున్నాడు.  ఇటీవల జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మలన్‌ అద్భుతంగా రాణించాడు. పొట్టి ఫార్మాట్‌లో 16 మ్యాచ్‌లే ఆడిన డేవిడ్‌ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.   

మలన్‌ తర్వాత పాక్‌ స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ అజామ్‌(869), అస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ పించ్‌(835), కేఎల్‌ రాహుల్‌(824), కోలిన్‌ మున్రో(785) టాప్‌-5లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(673) తొమ్మితో స్థానంలో నిలిచాడు. ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత క్రికెటర్లకు మాత్రమే మెరుగైన స్థానాలు దక్కాయి. ఇంగ్లాండ్‌తో ఆఖరిదైన మూడో టీ20లో ఆసీస్‌ గెలుపొందింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్నది.  


logo