శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 01:06:57

క్రొయేషియాతో భారత్‌ ఢీ

 క్రొయేషియాతో భారత్‌ ఢీ

జగ్రెబ్‌: డేవిస్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో కఠిన ప్రత్యర్థి క్రొయేషియాను ఢీకొట్టేందుకు భారత టెన్నిస్‌ జట్టు సిద్ధమైంది. రెండు రోజుల పాటు ఇరు జట్ల మధ్య జరిగే ‘టై’శుక్రవారం ప్రారంభం కానుంది. సింగిల్స్‌లో భారత్‌ తరఫున రామ్‌కుమార్‌ రామనాథన్‌, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, లియాండర్‌ పేస్‌ ఆడనుండగా.. సుమిత్‌ నాగల్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 


పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ మారిన్‌ సిలిచ్‌ రూపంలో కఠిన పరీక్షే ఎదురుకానున్నా.. మంచి ఫామ్‌లో ఉన్న రామ్‌ కుమార్‌, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ అద్భుతాలు చేస్తారా చూడాలి. ఈ ‘టై’డబుల్స్‌లో గెలిచిన జోడీ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్‌కప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించనున్న నేపథ్యంలో ఈ పోరు కీలకంగా మారింది. తన కెరీర్‌లో చివరి డేవిస్‌ కప్‌ ఆడుతున్న భారత దిగ్గజ ప్లేయర్‌ లియాండర్‌ పేస్‌ సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నాడు. 


logo