శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 28, 2020 , 00:26:58

లేడీ గెటప్​లో వార్నర్

లేడీ గెటప్​లో వార్నర్

లాక్​డౌ​న్ సమయంలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రతిరోజూ విభిన్నమైన వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. పిల్లలు, భార్యతో డ్యాన్స్​లు చేస్తూ సందడి చేస్తున్నాడు. టిక్​టాక్ వీడియోలతో అదరగొడుతున్నాడు. తాజాగా వార్నర్ కాసేపు లేడీ గెటప్ కూడా వేశాడు. వార్నర్​ ఆస్ట్రేలియా జెర్సీని భార్య​ క్యాండిస్​ ధరించగా.. కాసేపు అతడు లేడీస్​ స్విమ్ సూట్​లో కనిపించాడు. ఇంట్లోనే బోట్ నడుపుతున్నట్టు నటించాడు. ఈ వీడియోను సోమవారం ఇన్​స్టాగ్రామ్​లో వార్నర్​ పంచుకున్నాడు. ఈ వీడియోకు అభిమానులు లైక్​లు, విచిత్రమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


logo