గురువారం 22 అక్టోబర్ 2020
Sports - Sep 21, 2020 , 18:41:09

కెప్టెన్ వార్నర్‌ ఖాతాలో మరో రికార్డు..!

 కెప్టెన్ వార్నర్‌ ఖాతాలో మరో రికార్డు..!

దుబాయ్‌:  ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్‌ డేవిడ్‌ వార్నర్‌  ఐపీఎల్‌లో మరోసారి  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  2015 నుంచి 2017 వరకూ కెప్టెన్‌గా కొనసాగాడు.   2016లో తన కెప్టెన్సీలోనే  హైదరాబాద్‌ను విజేతగా నిలిపిన వార్నర్‌..  బాల్‌ టాంపరింగ్‌  ఆరోపణలతో  2018 సీజన్‌కు దూరమయ్యాడు. వార్నర్‌  గైర్హాజరీలో న్యూజిలాండ్‌  సారథి  కేన్‌ విలియమ్సన్‌  నాయకత్వ   బాధ్యతలు తీసుకున్నాడు. 

వార్నర్ గతేడాది తిరిగి సన్‌రైజర్స్‌ జట్టులోకి వచ్చినా యాజమాన్యం అతనికి  కెప్టెన్సీ అప్పగించలేదు.  ఐపీఎల్‌-13వ సీజన్‌కు  వార్నర్‌నే కెప్టెన్‌గా నియమించారు.     ఇప్పటివరకూ  సన్‌రైజర్స్‌కు  45 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆసీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌..గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సమయంలో  రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 

ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 47 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన వార్నర్‌..సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌  ఐపీఎల్‌ కెప్టెన్‌గా అతడికిది 48వది  కావడం విశేషం. దీంతో 47 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్‌ కుమార సంగక్కరను వార్నర్‌ అధిగమిస్తాడు.   ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా  చేసిన మూడో విదేశీ ప్లేయర్‌గా వార్నర్‌ నిలుస్తాడు.  ఆసీస్‌ లెజండరీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఐపీఎల్‌లో  71సార్లు కెప్టెన్‌గా ఉన్నారు. అతని తర్వాత ఆస్ట్రేలియా లెజెండ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న 55 మ్యాచ్‌లకు సారథిగా చేసి రెండో స్థానంలో ఉన్నారు. 

 logo