హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పాచౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కచడ కచడ హోగయా అర్థమైత లేదయా..జిందగిలో లేదే సెహరి’ అనే గీతాన్ని సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న వరుణ్ అనే యువకుడి కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. కోటి, అభినవ్ గోమఠం, ప్రణీత్‌రెడ్డి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథ్.