గురువారం 28 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 13:10:15

ఫిట్‌గా లేక‌పోయినా.. మూడోటెస్ట్‌లో ఆడ‌తా!

ఫిట్‌గా లేక‌పోయినా.. మూడోటెస్ట్‌లో ఆడ‌తా!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌కు ముందు రోహిత్ శ‌ర్మ టీమిండియాలో చేర‌డం టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అయితే అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా కూడా అలాంటి బూస్ట్ కోసం ఎదురుచూస్తోంది. గాయ‌ప‌డిన డేవిడ్ వార్న‌ర్‌.. మూడోటెస్ట్‌లో ఆడ‌తాడా లేదా, అత‌ను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా అని టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళ‌న చెందుతోంది. అయితే వార్న‌ర్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సిడ్నీ టెస్ట్‌లో ఆడతాన‌ని చెబుతున్నాడు. తాను 100 శాతం ఫిట్ లేక‌పోయినా ఆడే అవ‌కాశాలు ఉన్న‌ట్లు హింట్ ఇచ్చాడు. తాజాగా త‌న ఫిట్‌నెస్‌పై వార్న‌ర్ మీడియాకు వివ‌రించాడు. 

100 శాతం ఫిట్‌నెస్ డౌటే!

గ‌త రెండు రోజులుగా నేను ప‌రుగెత్త‌లేదు. ఇవాళ‌, రేపు నేను ఎంత ఫిట్‌గా ఉంటాన‌నే దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. వంద శాతం ఫిట్‌గా ఉంటానా? అనుమానమే. కానీ మూడో టెస్ట్ ఆడ‌టానికి క‌చ్చితంగా ప్ర‌య‌త్నిస్తాను. అంటే నేను 100 శాతం ఫిట్‌గా లేక‌పోయినా స‌రే అని వార్న‌ర్ చెప్ప‌డం విశేషం. ఇప్ప‌టికీ తాను కొన్ని షాట్లు ఆడ‌లేక‌పోతున్నాన‌ని, అయితే త‌న‌కు దీని కంటే కూడా వికెట్ల మ‌ధ్య వేగంగా ప‌రుగెత్త‌డ‌మే ముఖ్య‌మ‌ని వార్నర్ అన్నాడు. ఇక తుది జ‌ట్టుపై సెల‌క్ట‌ర్ల నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని, దీనిపై తానేమీ మాట్లాడ‌లేన‌ని చెప్పాడు. 


logo