ఆదివారం 17 జనవరి 2021
Sports - Nov 30, 2020 , 15:07:10

ఆస్ట్రేలియాకు షాక్‌.. మూడో వ‌న్డే, టీ20 సిరీస్‌ నుంచి వార్న‌ర్ అవుట్‌

ఆస్ట్రేలియాకు షాక్‌.. మూడో వ‌న్డే, టీ20 సిరీస్‌ నుంచి వార్న‌ర్ అవుట్‌

సిడ్నీ:  టీమిండియాపై వ‌రుస‌గా రెండు వ‌న్డేలు గెలిచి సిరీస్ ఎగురేసుకుపోయిన ఆస్ట్రేలియాకు షాక్ త‌గిలింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ గాయం కార‌ణంగా మూడో వ‌న్డేతోపాటు టీ20 సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. టెస్ట్ సిరీస్‌కు కూడా అత‌డు అందుబాటులో ఉండేది అనుమాన‌మే. రెండో వ‌న్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్న‌ర్ గాయ‌ప‌డ్డాడు. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో డైవ్ చేసి ఓ బంతిని ఆపే స‌మ‌యంలో అత‌నికి గ‌జ్జ‌ల్లో గాయ‌మైంది. నొప్పితో విల‌విల్లాడుతూ అత‌డు అప్పుడే మైదానాన్ని వీడాడు. ఆ వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డం క‌నిపించింది. వార్న‌ర్ స‌రిగా న‌డ‌వ‌డానికి కూడా ఇబ్బంది ప‌డ‌టం వీడియోల్లో కనిపించింది. దీంతో అత‌నికి మూడో వ‌న్డేతోపాటు, టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రెండు వ‌న్డేల్లోనూ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీలు చేశాడు. కెప్టెన్ ఫించ్‌తో క‌లిసి రెండు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్‌లు నెల‌కొల్పాడు. మ‌రోవైపు స్టార్ బౌల‌ర్ ప్యాట్ క‌మిన్స్‌కు కూడా మిగ‌తా ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. టెస్ట్ సిరీస్‌కు అత‌డు పూర్తి ఫిట్‌గా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంది.