శనివారం 16 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 16:28:06

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

సిడ్నీ:భారత్‌తో బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌  గజ్జల్లో గాయం నుంచి  కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు దూరంకానున్నాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం తెలిపింది.   వార్నర్‌తో పాటు పేసర్‌ సీన్‌ అబాట్‌ ఇద్దరినీ మెల్‌బోర్న్‌లోని ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ బయో సెక్యూర్‌ బబుల్‌కు దూరంగా ఉంచామని సీఏ వెల్లడించింది.  సిడ్నీలో కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ముందు జాగ్రత్తగా వీరిద్దరినీ జట్టు బయోబబుల్‌లోకి అనుమతించలేదు. 

గాయం నుంచి కోలుకునేందుకు  ఇద్దరు ఆటగాళ్ల కూడా సిడ్నీలో ఉన్న విషయం తెలిసిందే.  భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో డిసెంబర్‌ 26 నుంచి జరగనుంది. రెండు జట్లు కూడా బయో సెక్యూర్‌ వాతావరణంలో సాధన చేస్తున్నాయి. రెండో  టెస్టు వరకు   వార్నర్  గాయం నుండి కోలుకునే అవకాశం లేకపోవడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. సిడ్నీలో కరోనా వ్యాఫ్తి నేపథ్యంలో క్వారంటైన్‌ సమస్యలు తలెత్తకుండా వార్నర్‌, అబాట్‌ ఇద్దరూ కూడా శనివారమే మెల్‌బోర్న్‌కు వచ్చారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

గుప్కార్ కూట‌మి ఏంటి? ఆ పేరెలా వ‌చ్చింది?

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

600 డాల‌ర్లు కాదు.. ఒక్కొక్క‌రికి 2వేల డాల‌ర్లు ఇవ్వండి

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు: బీజేపీ