మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 09, 2020 , 10:12:40

భారత్‌తో ఫస్ట్‌టెస్ట్‌ నుంచి వార్నర్‌ ఔట్‌

భారత్‌తో ఫస్ట్‌టెస్ట్‌ నుంచి వార్నర్‌ ఔట్‌

సిడ్నీ: భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మొదటి టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో వార్నర్‌ గాయపడిన విషయం తెలిసిందే. గజ్జల్లో గాయం కారణంగా సిడ్నీలోని పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మొదటి టెస్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్నర్‌ వెల్లడించారు. ఈనెల 17 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. 

ప్రస్తుతం తాను గాయం నుంచి కోలుకుంటున్నానని, అయితే వంద శాతం ఫిట్నెస్‌తోనే స్టేడియంలో అడుగుపెడుతానని చెప్పాడు. బాక్సింగ్‌ డే టెస్టు వరకు ఫిట్‌నెస్‌ సాధిస్తాననే నమ్మకం ఉందన్నాడు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆడలేకపోతున్నానని వెల్లడించాడు. వికెట్ల మధ్య పరుగెత్తడం, మైదానంలో చురుగ్గా కదలడం వంటివి చేయలేకపోతున్నాని, దీనికి మరో పదిరోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపాడు. 

కాగా, వార్నర్‌ స్థానంలో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా తీసుకుందామనుకున్న విల్‌ పుకోవ్‌స్కీ నిన్న గాయడ్డాడు. భారత్‌ ఏతో నిన్న సిడ్నీలో జరిగిన మూడురోజుల మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా పుకోవ్‌స్కీ హెల్‌మెట్‌కు బాల్‌ తగిలింది. దీంతో అతడు మొదటి మ్యాచ్‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఆసిస్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌పై సందిగ్ధత నెలకొన్నది.