సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 15:56:54

ఈ ఫోటోకు క్యాప్ష‌న్ ఇవ్వండి : డేవిడ్ వార్న‌ర్‌

ఈ ఫోటోకు క్యాప్ష‌న్ ఇవ్వండి :  డేవిడ్ వార్న‌ర్‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న కూతుళ్ల కొత్త ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.  క్రికెట్ బ్యాట్లు ప‌ట్టుకున్న ముగ్గురు అమ్మాయిలు ఆ ఫోటోలో ఉన్నారు.  ఐవీ మే, ఇండీ రే, ఇస్లా రోజ్‌లు బ్యాట్లు ప‌ట్టుకుని ఫోటోకు స్మైల్ ఇచ్చారు.  లాక్‌డౌన్ వేళ త‌న కూతుళ్ల‌తో టిక్‌టాక్ వీడియోలు చేసి క్రికెట్ ఫ్యాన్స్‌ను వార్న‌ర్ అట్రాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజా ఇన్‌స్టా పోస్టులో త‌న కూతుళ్ల‌లో క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా జ‌త చేశాడు. భార‌త్‌తో అడిలైడ్‌లో జ‌రిగిన టెస్టు మిస్సైయిన వార్న‌ర్‌.. ఈనెల 26న మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టులో ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌న్డే సిరీస్‌లో గాయ‌ప‌డ్డి వార్న‌ర్ ఆ త‌ర్వాత టీ20 సిరీస్ కూడా మిస్స‌య్యాడు.