ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 19:20:35

ఆసీస్‌కు షాక్‌.. 3 పరుగులకే 2 వికెట్లు

ఆసీస్‌కు షాక్‌.. 3 పరుగులకే 2 వికెట్లు

సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే   ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌ కాగా మరో బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ కేరీ(2)  స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌..బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  తర్వాత  క్రీజులోకి వచ్చిన  కేరీని రెండో ఓవర్‌లోనే  మార్క్‌వుడ్‌   ఔట్‌ చేసి   ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. 

దీంతో కేవలం మూడు పరుగులకే ఆసీస్‌ రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది.  ఐదో ఓవర్లో  టామ్‌ కరన్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌(10)  కూడా ఔటవడంతో  కంగారూలపై ఒత్తిడి పెరగడంతో  ఆచితూచి ఆడుతున్నారు.  5 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది.  


logo