e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home స్పోర్ట్స్ వార్నర్‌Xస్లేటర్‌

వార్నర్‌Xస్లేటర్‌

వార్నర్‌Xస్లేటర్‌
  • గొడవ పడలేదని స్పష్టీకరణ

మేల్‌ (మాల్దీవులు): ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, ఆ దేశ కామెంటేటర్‌ మైకేల్‌ స్లేటర్‌ మాల్దీవుల్లోని ఓ బార్‌లో పరస్పరం కొట్టుకున్నారన్న వార్తలు వెలువడగా.. అలాంటిదేమీ లేదని ఆ ఇద్దరూ చెప్పారు. ఐపీఎల్‌ వాయిదా పడ్డాక ప్రస్తుతం ఆసీస్‌ బృందంతో మాల్దీవుల్లో క్వారంటైన్‌లో ఉన్న వారి మధ్య మాటామాటా పెరిగి శారీరకంగా దాడి చేసుకున్నారని ‘డైలీ టెలీగ్రాఫ్‌’ వెల్లడించింది. ఈ విషయంపై స్లేటర్‌ ఆదివారం స్పందిస్తూ అసలు ఏమీ జరుగలేదని చెప్పాడు. ‘ఇవి కేవలం ఊహాగానాలే. నేను, వార్నర్‌ మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో స్లేటర్‌ వెల్లడించాడు. ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదని, అసలు ఎలాంటి గొడవ జరుగలేదని వార్నర్‌ సైతం చెప్పాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వార్నర్‌Xస్లేటర్‌

ట్రెండింగ్‌

Advertisement