మంగళవారం 14 జూలై 2020
Sports - Apr 27, 2020 , 17:02:27

తెగ న‌వ్విస్తున్న డేవిడ్‌ వార్న‌ర్ టిక్‌టాక్ వీడియో..

తెగ న‌వ్విస్తున్న డేవిడ్‌ వార్న‌ర్ టిక్‌టాక్ వీడియో..


హైద‌రాబాద్ : మైదానంలో బౌండ‌రీల‌తో హోరెత్తించే డేవిడ్ వార్న‌ర్‌.. ఇప్పుడు టిక్‌టాక్ వీడియోల‌తో థ్రిల్ పుట్టిస్తున్నాడు.  ఇటీవ‌లే త‌న కూతురితో క‌లిసి కొన్ని వీడియోలు చేసిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్.. ఇప్పుడు త‌న భార్య క్యాండిస్‌తో క‌లిసి ఓ వీడియో చేశాడు. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆ వీడియో తెగ న‌వ్వులు పూయిస్తున్న‌ది.  వార్న‌ర్ భార్య క్యాండిస్ కూడా స్పోర్ట్స్‌మెన్‌. కానీ ఆమె స‌ర్ఫింగ్‌లో మేటి.  ఫుల్‌ ఫిట్‌గా ఉండే క్యాండిస్‌.. బోట్ స‌ర్ఫింగ్‌లో ఎక్స్‌ప‌ర్ట్‌.  అయితే ఇవాళ పోస్టు చేసిన వీడియోలో ఓ గ‌మ్మ‌త్తు ఉన్న‌ది.  వార్న‌ర్ త‌న కాస్ట్యూమ్‌లో తొలుత ఆసీస్ జ‌ట్టు జెర్సీ వేసుకుని ఉన్నాడు. అత‌ని వెనుక క్యాండిస్‌.. స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లో బోటు న‌డుపుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓ లైట్ మ్యూజిక్‌తో వీడియో సాగుతుంది. అయితే అక‌స్మాత్తుగా ఆ వీడియో ఇద్ద‌రి ప్లేస్ మారుతుంది.  వార్న‌ర్ డ్రెస్సులో క్యాండిస్‌.. భార్య స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లోకి డేవిడ్ మారుతాడు.  ఇక ఆ వీడియో చూసి న‌వ్వ‌డ‌మే మ‌న వంతు. ఇన్‌స్టాలో ఉన్న టిక్‌టాక్ వీడియో ఇదే..


View this post on Instagram

ISO Monday’s #flicktheswitch @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on


logo