శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 08, 2020 , 20:01:50

IPL 2020: రైజర్స్‌ ఓపెనర్లు అదరగొట్టారు!

IPL 2020: రైజర్స్‌  ఓపెనర్లు అదరగొట్టారు!

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మెరుపు ఆరంభం లభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న   సన్‌రైజర్స్‌   ఆట అనుకున్నట్టుగా సాగుతోంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో  పవర్‌ప్లేలో భారీ హిట్టింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే  వార్నర్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా,  5 ఎక్స్‌ట్రా రన్స్‌ రావడంతో 13 పరుగులు వచ్చాయి.   

అనూహ్యంగా రెండో ఓవర్‌లోనే కేఎల్‌ రాహుల్‌.. స్పిన్నర్‌ ముజీబ్‌ను రంగంలోకి దించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ముజీబ్‌ కేవలం 6 పరుగులు ఇచ్చాడు. కాట్రెల్‌ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్‌స్టో  మూడు  ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.    మొదటి ఓవర్‌ నుంచే సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ఆచితూచి ఆడారు.

ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.  ఈ సీజన్‌లో  పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కిదే అత్యధిక స్కోరు   వార్నర్‌(26), బెయిర్‌స్టో(26) క్రీజులో ఉన్నారు.