శుక్రవారం 29 మే 2020
Sports - May 22, 2020 , 20:34:10

కోహ్లీకి వార్న‌ర్ ఆహ్వానం

కోహ్లీకి వార్న‌ర్ ఆహ్వానంన్యూఢిల్లీ:  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌త్యేక‌మైన‌ ఆహ్వానం పంపాడు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గాక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు ర‌మ్మ‌నో.. లేక ఆసీస్ టూర్‌లో భాగంగా త‌న ఇంటికి వ‌చ్చిపొమ్మ‌నో పిలిచాడనుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్లే. అవేవీ కాదు లాక్‌డౌన్ కార‌ణంగా క్రికెట్ టోర్నీల‌న్నీ నిలిచిపోవ‌డంతో.. ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన స‌మ‌యంలో వార్న‌ర్ సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ ఇలా దేన్ని వ‌ద‌లడం లేదు. ఇక టిక్‌టాక్ విష‌యానికివ‌స్తే అత‌డు సూప‌ర్ స్టార్ అయిపోయాడు. 

భార‌త్‌పై త‌న‌కున్న మ‌క్కువ‌తో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ పాట‌ల‌కు త‌న‌దైన రీతిలో స్టెప్పులేసి అభిమానుల‌ను అల‌రిస్తున్న వార్న‌ర్ తాజాగా అక్ష‌య్ కుమార్ న‌టించిన హౌజ్‌ఫుల్‌-4లో `బాలా, బాలా` పాట‌కు సూప‌ర్ స్టెప్స్‌తో అల‌రించాడు. ఇది చూసిన కోహ్లీ రిప్లేగా న‌వ్వుతున్న ఎమ్మోజీల‌ను పెట్టాడు. దీంతో వార్న‌ర్ కోహ్లీని కూడా టిక్‌టాక్‌లో చేర‌మ‌ని ఆహ్వానించాడు. నువ్వు కూడా ఇలాంటివి చేయి అంటూ ప్రోత్స‌హించాడు. నీకు అకౌంట్ లేక‌పోతే నీ భార్య‌, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌కు చెప్పు ఆమె నీ కోసం ప్ర‌త్యేక అకౌంట్ త‌యారు చేస్తుంద‌ని స‌ల‌హా ఇచ్చాడు. మ‌రి వార్న‌ర్ స‌ల‌హా మేర‌కు కోహ్లీ కూడా టిక్‌టాక్‌లో చేరి భార్య‌తో క‌లిసి డ్యూయెట్ల‌కు కాలు క‌దుపుతాడా చూడాలి. 


logo