శనివారం 16 జనవరి 2021
Sports - Jan 02, 2021 , 15:27:40

టెస్టుల్లో నట్టూ అరంగేట్రంపై వార్నర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

టెస్టుల్లో నట్టూ అరంగేట్రంపై వార్నర్​ ఆసక్తికర వ్యాఖ్యలు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మిగతా టెస్టులకు తమిళనాడు పేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌మేట్‌ టీ నటరాజన్ ఎంపికవడంపై ఆస్ట్రేలియా ఓపెనర్‌, హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు.  నటరాజన్‌కు  నైపుణ్యం ఉన్నప్పటికీ  స్థిరంగా   దానిని అమలు చేస్తాడనే విషయాన్ని నమ్మకంగా చెప్పలేనని అన్నాడు. 

'నట్టూకు ఇది గొప్ప బహుమతి అని అనుకుంటున్నా. తనకు  బిడ్డ పుట్టినా స్వదేశానికి  వెళ్లకుండా నెట్​ బౌలర్​గా ఇక్కడుకు వచ్చి, తుది జట్టులో చోటు సంపాదించడం గొప్ప విజయం. అతనికి అభినందనలు.  నట్టూ అద్భుతమైన బౌలర్‌. సన్‌రైజ్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా నేను అతన్ని గమనించాను.   అవకాశం వస్తే ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతడికి బాగా తెలుసని' వార్నర్‌ పేర్కొన్నాడు. ఎడమచేతివాటం సీమర్‌ నట్టూ టెస్టుల్లో వరుస ఓవర్లలో  స్థిరంగా  లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తాడని కచ్చితంగా చెప్పలేనని అన్నాడు.