మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 15:45:51

షారుక్ ఖాన్‌లా మారిన డేవిడ్ వార్న‌ర్‌.. వైర‌ల్ వీడియో

షారుక్ ఖాన్‌లా మారిన డేవిడ్ వార్న‌ర్‌.. వైర‌ల్ వీడియో

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కు ఆడే ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.. ఇప్ప‌టికే ఎన్నో తెలుగు పాట‌ల‌కు స్టెప్పులేసి అల‌రించాడు. ఇప్పుడు అత‌డు మ‌రో అవ‌తార‌మెత్తాడు. రోజుకో బాలీవుడ్ యాక్ట‌ర్‌గా మారిపోతున్నాడు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ యాక్ష‌న్ సీన్ల‌లో త‌న‌ను తాను చూసుకుంటూ మురిసిపోతున్నాడు. Reface అనే యాప్ ద్వారా అత‌డు త‌న బాలీవుడ్ ముచ్చ‌టను తీర్చుకుంటున్నాడు. ఇప్ప‌టికే హృతిక్ రోష‌న్‌, ఆమిర్‌ఖాన్‌ల‌తోపాటు చాలా మంది సెల‌బ్రిటీలుగా మారిపోయిన వార్న‌ర్‌.. తాజాగా షారుక్‌గా మారిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిని పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే ప‌ది ల‌క్ష‌ల‌కుపైగా వ్యూస్ రావ‌డం విశేషం. ఇందులో కాస్త హింస ఎక్కువైంది.. క్ష‌మించండి అంటూ ఓ ఫ‌న్నీ కామెంట్ కూడా జ‌త‌చేశాడు. డాన్ 2 మూవీలోని యాక్ష‌న్ సీన్స్‌ను అత‌డు వాడుకోవ‌డంతో ఆ మూవీ డైరెక్ట‌ర్ ఫ‌ర్హాన్ అక్త‌ర్ కూడా కామెంట్ చేశాడు. ఇలాంటి ఫ‌న్నీ వీడియోల‌తోనే వార్నిర్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇన్‌స్టాగ్రామ్‌లో 50 ల‌క్ష‌ల‌కుపైగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకోవ‌డం విశేషం.


logo