మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 16:51:28

ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ చూశారా? వీడియో వైరల్‌

ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ చూశారా? వీడియో వైరల్‌

నేపియర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.  ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాక్‌ ఓపెనర్‌  మహ్మద్‌ రిజ్వాన్‌(89) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో కివీస్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ డారెల్‌ మిచెల్‌ ఫీల్డింగ్‌ విన్యాసం  మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది.  ఓపెనర్లు హైదర్‌ అలీ, రిజ్వాన్‌ ఐదు ఓవర్లలోనే 38 పరుగులతో జట్టుకు శుభారంభాన్నందించారు.

కుగెలీన్‌ వేసిన  పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌లో అలీ బ్యాట్‌కు ఎడ్జ్‌ అయిన బంతి గాల్లో లేచింది. సర్కిల్‌లో ఉన్న డారెల్‌ పరుగెత్తుకుంటూ వెళ్లి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అంతకుముందు బంతిని క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో ఆ జట్టు ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ గాయంతో మైదానాన్ని వీడటంతో డారెల్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇవి కూడా చ‌ద‌వండి

వ్యాక్సిన్‌లో పంది మాంసం.. వ్య‌తిరేకిస్తున్న ముస్లిం దేశాలు!

66 ల‌క్ష‌ల కోట్ల కోవిడ్ ప్యాకేజీకు అమెరికా ఆమోదం

ఆపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు!


logo