శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 00:48:48

లీమన్‌కు శస్త్రచికిత్స

లీమన్‌కు శస్త్రచికిత్స

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డారెన్‌ లీమన్‌ అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం 50వ పుట్టిన రోజు జరుపుకున్న లీమన్‌..తన కొడుకు క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన దగ్గరలోని దవాఖానకు తరలించి వైద్యం అందించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దవాఖానలో చికిత్స తీసుకుంటున్న లీమన్‌కు శనివారం శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ‘నా పట్ల అభిమానం కురిపించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులందరికీ కృతజ్ఞతలు. అత్యుత్తమ వైద్యంతో త్వరలో కోలుకుని తిరిగి వస్తానన్న నమ్మకం నాకుంది’ అని లీమన్‌ అన్నాడు. రెండేండ్ల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో తన చీఫ్‌ కోచ్‌ పదవికి లీమన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 


logo