ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 04, 2020 , 00:12:16

మా వల్ల కాదు

మా వల్ల కాదు

  • ఇంగ్లండ్‌ పర్యటనకు నిరాకరించిన బ్రావో, హెట్‌మైర్‌, పాల్‌

అంటిగ్వా: వెస్టిండీస్‌ ఆటగాళ్లు డారెన్‌ బ్రావో, షిమ్రాన్‌ హెట్‌మైర్‌, కీమో పాల్‌.. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధంగా      లేమని ప్రకటించారు. దీంతో వచ్చే నెలలో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న మూడు టెస్టుల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వీరి పేర్లను పరిగణించకుండా.. 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టుతో పాటు 11 మంది రిజర్వ్‌ ఆటగాళ్లను ఎంపిక చేయ డం గమనార్హం. జూలై 8న ప్రారంభం కానున్న సిరీస్‌ కోసం విండీస్‌ జట్టు ఈ నెల 8న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌ బయలుదేరనుంది. ఈ పర్యటనకు వెళ్లడం ఇష్టంలేని ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి చేయబోమని బోర్డు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.


logo