మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 16:47:37

బ్యాట్స్‌మెన్‌ విధ్వంసం..ఒకే ఓవర్లో 6, 6, 4, 6!: వీడియో వైరల్‌

బ్యాట్స్‌మెన్‌ విధ్వంసం..ఒకే ఓవర్లో  6, 6, 4, 6!:  వీడియో వైరల్‌

సిడ్నీ: వరల్డ్‌ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడుతుంటారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయకుండా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. మంచి ఎకానమీతో ప్రస్తుతం అతడు ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.   ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో రషీద్‌ ఖాన్‌ అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బీబీఎల్ 2020-21 సీజన్‌ మ్యాచ్‌-5లో భాగంగా హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డీర్సీ షార్ట్(72)‌ వీరవిహారం చేశాడు.  ఈ మ్యాచ్‌లో హరికేన్స్‌ 11 పరుగుల తేడాతో స్ట్రైకర్స్‌ జట్టును ఓడించింది.   సూపర్‌ ఫామ్‌లో ఉన్న షార్ట్‌..రషీద్‌ వేసిన 14వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 బాదాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


logo