సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 07, 2020 , 18:19:59

సూర్య‌కుమార్ న్యూజిలాండ్‌కు ఆడేవాడే.. కానీ!

సూర్య‌కుమార్ న్యూజిలాండ్‌కు ఆడేవాడే.. కానీ!

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ డానిష్ క‌నేరియా.. అక్క‌డి క్రికెట్ బోర్డుపై మండిప‌డ్డాడు. పాక్‌లో నైపుణ్యం ఉన్న క్రికెట‌ర్లు వేరే దేశానికి వెళ్లిపోవ‌డంపై క‌నేరియా స్పందిస్తూ.. ఇండియ‌న్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ గురించి ప్ర‌స్తావించాడు. అత‌డు న్యూజిలాండ్ టీమ్‌కు ఆడేవాడే కానీ.. ఆ టీమ్ మాజీ ప్లేయ‌ర్ స్కాట్ స్టైరిస్ అత‌న్ని త‌మ టీమ్‌కు ఆడాల్సిందిగా కోరాడు. కానీ అదే స‌మ‌యంలో సూర్య‌కుమార్‌కు అత‌ని ఫ్రాంచైజీ, బీసీసీఐ అండ‌గా నిలిచాయి. అత‌ను ఇండియాను విడిచి వెళ్ల‌లేదు అని క‌నేరియా అన్నాడు. పాక్ క్రికెట‌ర్ స‌మీ అస్ల‌మ్ ఈ మ‌ధ్యే తాను అమెరికాకు వెళ్లిపోతున్నాన‌ని, ఆ దేశం నుంచి క్రికెట్ ఆడ‌తాన‌ని చెప్పిన విష‌యాన్ని క‌నేరియా గుర్తు చేశాడు. అస్ల‌మ్ పాక్ త‌ర‌ఫున 2017లో ఆడాడు. మొత్తం 13 టెస్టులు, 4 వ‌న్డేల్లో పాక్ టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అత‌డు చాలా నిల‌క‌డైన ఆట‌గాడు. కానీ అత‌నికి అన్యాయం చేశారు. అస్ల‌మ్‌కు స‌రైన అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. ఇలాంటి ప్లేయ‌ర్స్‌ను దేశం వ‌దిలి వెళ్లేలా పీసీబీ చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం అని క‌నేరియా అన్నాడు. త‌న‌కు కూడా రెండు దేశాల నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, తాను మాత్రం దేశం వ‌దిలి వెళ్ల‌లేద‌ని చెప్పాడు.