గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 19:35:00

క్యాబ్‌ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు..

క్యాబ్‌ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు..

కలకత్తా: క్యాబ్‌(క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌) నూతన అధ్యక్షుడిగా అవిషేక్‌ దాల్మియా  ఎంపికయ్యాడు. అవిషేక్‌.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత పారిశ్రామికవేత్త జగ్‌మోహన్‌ దాల్మియా కుమారుడు. జగ్‌మోహన్‌ దాల్మియా గతంలో క్యాబ్‌ అధ్యక్షుడిగా, ఐసీసీ ప్రెసిడెంటుగా కూడా సేవలందించారు. క్యాబ్‌ ముఖ్య కార్యదర్శిగా స్నేహాషిష్‌ గంగూలీ ఎంపికయ్యాడు. ఇతడు టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ సోదరుడు కావడం విశేషం. కాగా, ఇవాళ ఎంపికైన క్యాబ్‌ నూతన కార్యవర్గానికి ప్రముఖ క్రికెటర్లు, క్యాబ్‌ మాజీ కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. 


logo
>>>>>>