ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 02:12:45

పోస్టల్‌ కస్టమర్ల కోసం డాక్‌పే

పోస్టల్‌ కస్టమర్ల కోసం డాక్‌పే

న్యూఢిల్లీ: పోస్టల్‌ విభాగ (ఇండియా పోస్ట్‌) కస్టమర్లతోపాటు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) కస్టమర్లు ఇకపై తమ బ్యాంకింగ్‌ లావాదేలను ‘డాక్‌పే’ యాప్‌ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం ఈ యాప్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇండియా పోస్ట్‌, ఐపీపీబీ అందజేస్తున్న డిజిటల్‌ ఆర్థి క, బ్యాంకింగ్‌ సేవలు డాక్‌పే యాప్‌లోనూ అందుబాటులో ఉం టాయి. నగదు బదిలీలతోపాటు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డిజిటల్‌ పద్ధతిలో చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్‌ వీలుకల్పిస్తుంది. ఇంటరాపరబిలిటీ ఫీచర్‌ను కలిగి ఉండే ఈ యాప్‌ సాయంతో దేశంలోని ఏ బ్యాంకు ఖాతాదారులైనా బ్యాంకింగ్‌ సేవలను పొందవచ్చు.