నిలకడగా దాదా ఆరోగ్యం

కోల్‌కతా: గుండెనొప్పి కారణంగా యాంజియోప్లాస్టి చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దాదా మెరుగ్గా ఉన్నారని, బీపీ, ఆక్సిజన్ స్థాయి సహా ఆరోగ్య పరిస్థితి మొత్తం సాధారణమేనని వుడ్‌ల్యాండ్స్ దవాఖాన డాక్టర్లు వెల్లడించారు. శనివారం స్వల్ప గుండెపోటు రావడంతో గంగూలీ దవాఖానలో చేరారు. దాదా గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో స్టెంట్ ను పంపి వైద్యులు క్లియర్ చేశారు. ‘గంగూలీకి తదుపరి చికిత్సపై మా వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితిని బట్టి మళ్లీ యాంజియోప్లాస్టి నిర్వహించాలా అన్న విషయంపై నిర్ణయానికి వస్తారు. దాదాకు బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. గంగూలీ రాత్రి ప్రశాంతంగా నిద్రించారు. ఉదయాన్ని బ్రేక్‌ఫాస్ట్ చేసి, న్యూస్‌పేపర్లు చదివారు’అని హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.
దాదాతో మాట్లాడిన ప్రధాని
సౌరవ్ గంగూలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే దాదా భార్య డోనా గంగూలీతోనూ ప్రధాని మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’