మంగళవారం 09 మార్చి 2021
Sports - Feb 07, 2021 , 00:45:49

రంగనాయకసాగర్‌ వద్ద సైక్లింగ్‌ పోటీలు

రంగనాయకసాగర్‌ వద్ద సైక్లింగ్‌ పోటీలు

చిన్నకోడూరు, ఫిబ్రవరి 6: పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రంగనాయక సాగర్‌ సైక్లింగ్‌ పోటీలకు సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని సాగర్‌ వద్ద ఆదివారం రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ రేస్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా సైక్లింగ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి అండర్‌ -14,16,18,23 పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ముంబైలో జరిగే జాతీయ స్థాయి సైక్లింగ్‌ రేస్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. శనివారం నిర్వహించిన ట్రయిల్స్‌లో 14 జిల్లాల నుంచి వచ్చిన 130 మంది సైక్లిస్టులు పాల్గొన్నారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

VIDEOS

logo