బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 12, 2021 , 01:29:16

డబుల్స్‌ చాంప్‌ సీవీ ఆనంద్‌

డబుల్స్‌ చాంప్‌ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఫతేమైదాన్‌ వేదికగా తెలంగాణ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎస్‌వీ రామయ్య స్మారక టోర్నీలో ఎన్‌ఐఎస్‌ఏ డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ సత్తాచాటారు. కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత జరిగిన జాతీయ సీనియర్‌ టోర్నీ 40 ఏండ్ల వయసు విభాగం డబుల్స్‌ ఫైనల్లో ఆనంద్‌, వహీద్‌ జోడీ 9-6తో శ్రీనివాస్‌, శివకుమార్‌ రాజుపై గెలిచి ట్రోఫీని దక్కించుకుంది. సింగిల్స్‌లో ఆనంద్‌ 9-7తో అశ్వనీపై విజయంతో టైటిల్‌ దక్కించుకున్నారు. విజేతలకు సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరసింహారెడ్డి ట్రోఫీలు అందజేశారు.


logo