బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 24, 2020 , 00:55:05

కోహ్లీసేనే అత్యుత్తమం: గవాస్కర్‌

కోహ్లీసేనే అత్యుత్తమం: గవాస్కర్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత జట్టే టీమ్‌ఇండియా చరిత్రలో అత్యుత్తమైన టెస్టు టీమ్‌ అని భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌ దళం వల్ల ప్రస్తుత జట్టు అంతకు ముందు తరాల కంటే సమతూకంగా ఉందని ఆదివారం ఓ టీవీ షోలో చెప్పాడు. ‘ప్రస్తుత జట్టు అత్యుత్తమైనదిగా నేను నమ్ముతాను. సమతూకం, నైపుణ్యం, సామర్థ్యం, ఆలోచన విధానాల  పరంగా ప్రస్తుత టెస్టు జట్టు బెస్ట్‌. ఇంతకంటే మంచి జట్టును ఊహించలేను. ప్రస్తుత భారత బౌలింగ్‌ దళం ఎక్కడైనా, ఎలాంటి పిచ్‌పై అయినా జట్టును గెలిపించగలదు’ అని గవాస్కర్‌ చెప్పాడు. అలాగే ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉంటే తాను భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మలా బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడేవాడినని సన్నీ చెప్పాడు.  కెప్టెన్‌గా కోహ్లీ.. ఐసీసీ టోర్నీలను గెలువాల్సిన అవసరం ఉందని  అభిప్రాయపడ్డాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విఫలమయ్యేందుకు నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌ లేకపోవడమే ప్రధాన కారణమని సునీల్‌ గవాస్కర్‌ చెప్పాడు.   


logo