మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 16:12:27

ఐసోలేషన్‌లోనే చెన్నై బ్యాట్స్‌మన్‌..తొలి మ్యాచ్‌కు దూరం!

ఐసోలేషన్‌లోనే చెన్నై బ్యాట్స్‌మన్‌..తొలి మ్యాచ్‌కు దూరం!

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పేసర్‌ దీపక్‌ చాహర్‌ కరోనా నుంచి కోలుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాడు. మరో బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకా వైరస్‌ నుంచి కోలుకోకపోవడంతో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నాడు. యువ క్రికెటర్‌కు మరో రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ ఫలితం నెగెటివ్‌గా తేలితేనే  బయోబబుల్‌లోకి అతడు ప్రవేశించే అవకాశం ఉంటుంది.  

చెన్నై  బృందంలోని 13 మందికి కరోనా సోకగా ఇప్పటికే 12 మంది సభ్యులు బయో బబుల్‌లోకి వచ్చేశారని ఫ్రాంఛైజీ తెలిపింది. ఈనెల 19న అబుదాబిలో ముంబై ఇండియన్స్‌తో  సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.    ఐపీఎల్‌  2020 ఆరంభ మ్యాచ్‌కు  గైక్వాడ్‌ దూరంకానున్నట్లు తెలుస్తున్నది. అతడు  ఇప్పటి వరకు నెట్‌ సెషన్‌లోనూ పాల్గొనలేదు. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలంటే అతడు ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌కావాల్సి ఉంటుంది. 


logo