ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 19:37:53

ఐసోలేషన్‌లో చెన్నై బ్యాట్స్‌మన్‌..టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరం

ఐసోలేషన్‌లో చెన్నై బ్యాట్స్‌మన్‌..టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరం

దుబాయ్‌:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మంది కరోనా  బారినపడిన విషయం తెలిసిందే. ఆ జట్టు పేసర్‌ దీపక్‌ చాహర్‌తో పాటు మరో 11 మంది సభ్యులు వైరస్‌ నుంచి కోలుకొని ట్రైనింగ్‌ను కూడా మొదలెట్టారు. మరో యువ ఆటగాడు మాత్రం ఇంకా కోలుకోలేదు. గత ఆది,  సోమవారాల్లో రెండు సార్లు గైక్వాడ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.  అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 19న ముంబై ఇండియన్స్‌తో టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ అందుబాటులో ఉండడని ఫ్రాంఛైజీ పేర్కొంది. టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన సురేశ్‌ రైనా స్థానాన్ని యువ క్రికెటర్‌తో భర్తీ చేయాలని సీఎస్‌కే భావిస్తున్నది.

ఇండియా ఏ బ్యాట్స్‌మన్‌ బాగానే బాగున్నాడు. కానీ, జట్టు బయో బుబుల్‌లోకి వచ్చేందుకు అతనికి ఇంకా బీసీసీఐ నుంచి అనుమతి రాలేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. 'బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ నుంచి అతనికి ఇంకా  ‌ క్లియరెన్స్‌ రాలేదు. ప్రస్తుతం ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. రాబోయే రెండు మూడు రోజుల్లో   బయో బబుల్‌లోకి వస్తాడని అనుకుంటున్నాం. అతను ఆరోగ్యంగానే ఉన్నాడని' విశ్వనాథన్‌ చెప్పాడు. 


logo