శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 22:13:28

సీఎస్​కేకు సెహ్వాగ్​ను కెప్టెన్​ చేద్దామనుకున్నారట

సీఎస్​కేకు సెహ్వాగ్​ను కెప్టెన్​ చేద్దామనుకున్నారట

2008 ఐపీఎల్ తొలి సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా టీమ్​ఇండియా డాషింగ్ బ్యాట్స్​మన్ వీరేంద్ర సెహ్వాగ్​ను తీసుకోవాలని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం అనుకుందని బ్యాట్స్​మన్​ సుబ్రమణ్యం బద్రీనాథ్​ చెప్పాడు. అయితే తన సొంత రాష్ట్రం ఢిల్లీకే ఆడతానని సెహ్వాగ్ చెప్పడంతో వేలంలో మహేంద్ర సింగ్ ధోనీని తీసుకుందని ఓ ఇంటర్వ్యూలో అతడు వెల్లడించాడు.

‘ఐపీఎల్ తొలి సీజన్​లో జట్టు కెప్టెన్​గా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీని తొలుత అనుకోలేదు. సెహ్వాగ్​కు కెప్టెన్సీ ఇవ్వాలని భావించింది. ఈ విషయంపై వీరూని సంప్రదించింది. అయితే ఢిల్లీలోనే పుట్టడం, ఆ నగరంతోనే ఎక్కువ అనుబంధం ఉండడంతో ఢిల్లీ తరఫునే ఆడతానని వీరూ చెన్నై మేనేజ్​మెంట్​కు చెప్పాడు. దీంతో వేలంలో అత్యుత్తమ ఆటగాడి కోసం చెన్నై అన్వేషించింది. అంతకు ముందే 2007 టీ20 ప్రపంచకప్​ను భారత్ గెలిచింది. అందుకే ఆ టోర్నీలో భారత్​కు సారథ్యం వహించిన ధోనీని రూ.6కోట్లు వెచ్చించి చెన్నై యాజమాన్యం సొంతం చేసుకుంది’ అని బద్రీనాథ్ చెప్పాడు. అలాగే ప్రపంచంలో  ధోనీనే అత్యున్నత కెప్టెన్​, బెస్ట్ ఫినిషర్ అని అతడు అన్నాడు.  కాగా అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్​కు సారథ్యం వహిస్తున్న ధోనీ.. ఇప్పటి వరకు జట్టుకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించాడు. చెన్నై అభిమానులు ధోనీని తలా(నాయకుడు) అని పిలుస్తున్నారు. సీఎస్​కే ఫ్రాంచైజీ సైతం ధోనీ మరిన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడాలని ఆశిస్తున్నది. కాగా గత నెల అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 


logo