గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 02:26:04

ప్రేమతో.. పచ్చబొట్లు

ప్రేమతో.. పచ్చబొట్లు

న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్‌ ఆడేందుకు కుటుంబానికి చాలా రోజులు దూరంగా వెళ్లనుండడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా వినూత్న ఆలోచన చేశాడు. తన భార్య ప్రియాంక, ఇటీవలే జన్మించిన కొడుకు రియో పేర్లను చేతులపై పచ్చబొట్లు వేయించుకున్నాడు. కుటుంబంపై ప్రేమను చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. కాగా తన కూతురు గ్రేసియా పేరును 2016లోనే రైనా టాటూ వేయించుకున్నాడు.  


logo