గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 14:47:48

కరోనా నుంచి కోలుకున్న దీపక్‌ చాహర్‌.. వర్కౌట్‌ వీడియో

కరోనా నుంచి కోలుకున్న దీపక్‌ చాహర్‌.. వర్కౌట్‌ వీడియో

దుబాయ్‌:  చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఆటగాళ్లు దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇటీవల కరోనా బారినపడిన విషయం తెలిసిందే. చెన్నై పేసర్‌ దీపక్‌ చాహర్‌ కరోనా నుంచి బాగానే కోలుకున్నట్లు తెలిపాడు. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతానని ధీమావ్యక్తం చేశాడు. 

తనకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన అభిమానులకు చాహర్‌ థాంక్స్‌ చెప్పాడు.   యువ పేసర్‌ ఐసోలేషన్‌లో ఉంటూనే ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.  దీపక్‌, రుతురాజ్‌ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. సెప్టెంబర్‌ 14 తర్వాత వీరిద్దరూ టీమ్‌తో కలిసే అవకాశం ఉన్నది.   


logo