ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 13, 2020 , 17:39:07

IPL 2020: ‘ఆరెంజ్‌ ఆర్మీ’ vs ‘ఎల్లో ఆర్మీ’..హోరాహోరీ పోరు..!

IPL 2020:  ‘ఆరెంజ్‌ ఆర్మీ’ vs ‘ఎల్లో ఆర్మీ’..హోరాహోరీ పోరు..!

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) మంగళవారం తలపడనున్నాయి.    లీగ్ దశలో మొదటి మ్యాచ్‌లో తమను  ఓడించిన సన్‌రైజర్స్‌పై   ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీసేన భావిస్తోంది.  సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌‌ల్లో రెండింటిలో మాత్రమే  గెలిచి   పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి  రెండో స్థానంలో  నిలిచిన ధోనీసేన  అసాధ్య ప్రదర్శన చేయాల్సి ఉంది. 

ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే  ప్రతీ మ్యాచ్‌లో   ‌ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.  ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే చెన్నై తమ చివరి ఏడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఆరింటిలో గెలవాల్సి ఉంది.  కెప్టెన్‌  ధోనీ వరుసగా విఫలమవడంతో జట్టు ఆందోళన చెందుతోంది.  లీగ్‌లో కాస్త  మెరుగైన ప్రదర్శన చేస్తున్న  హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం.  రాజస్థాన్‌తో   పోరులో కీలక సమయంలో చేతులెత్తేసి ఓటమిపాలైన హైదరాబాద్‌  తప్పులను సరిదిద్దుకొని బరిలో దిగుతోంది.   

బ్యాటింగ్‌‌లో  హైదరాబాద్‌ నిలకడగా రాణిస్తోంది. డేవిడ్‌ వార్నర్‌,   బెయిర్‌‌స్టో,  ‌ మనీశ్ పాండే‌‌, విలియమ్సన్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. ఐతే  డెత్‌‌ ఓవర్లలో  బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి పరుగులను నియంత్రించడంలో బౌలర్లు తేలిపోతున్నారు.   మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టాప్‌-4 రేసులో నిలవాలని వార్నర్‌సేన ఆసక్తిగా ఉంది.