మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 17:07:52

ఐపీఎల్‌ 2020 టైటిల్‌ గెలవడానికి చెన్నైకి గొప్ప అవకాశం:వాట్సన్‌

ఐపీఎల్‌ 2020 టైటిల్‌ గెలవడానికి చెన్నైకి గొప్ప అవకాశం:వాట్సన్‌

దుబాయ్‌: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2020 టైటిల్‌ నెగ్గేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు   గొప్ప అవకాశమని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు.  అనుభవజ్ఞులైన జట్టును కలిగి ఉండటం అంటే మొదటి మ్యాచ్‌ నుంచే ఒత్తిడిలో తమ  నైపుణ్యాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై ఆటగాళ్లకు ఎక్కువ అవగాహన కలిగి ఉండటమని  వాట్సన్ .. నబీల్‌ హషీమ్‌ యూట్యూబ్‌ షోలో చెప్పాడు. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు,  అపార అనుభవం మా జట్టులో ఉండటం మాకు కలిసొచ్చే అంశమని,  ఈ  ఏడాది ట్రోఫీ సాధించే అవకాశం మాకు ఎక్కువగా ఉందని   భావిస్తున్నట్లు వాట్సన్‌ తెలిపాడు. 

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో  వాట్సన్‌ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ ఫ్రాంచైజీకి చెందిన నబీల్‌ నిర్వహించిన షోలో అతడు పాల్గొన్నాడు.  'సాధ్యమైనంత ఎక్కువ తప్పులు చేయకుండా ఉండటానికి  మాకు  ఎక్కువ అవకాశం ఉన్నది. నేను గత నాలుగేండ్లుగా టీ20 మ్యాచ్‌లను ఆడుతూనే ఉన్నాను. నాకు ఎక్కువ అవగాహన ఉన్నప్పటికీ  నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఇప్పటికే సవాలే.  2018 సీజన్‌ నా ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమైనది. అది కేవలం ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రమే కాదు(ఈ మ్యాచ్‌లో వాట్సన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ సెంచరీ చేశాడు).'  అని వాట్సన్‌ వివరించాడు.logo