మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 20:04:36

IPL 2020:నల్ల బ్యాండ్‌ ధరించిన చెన్నై, ఢిల్లీ ఆటగాళ్లు

IPL 2020:నల్ల బ్యాండ్‌  ధరించిన చెన్నై, ఢిల్లీ ఆటగాళ్లు

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో భాగంగా శుక్రవారం దుబాయ్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నది.  ఇరు జట్ల  ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌ ధరించి బరిలో దిగారు.  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.   గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.  

డీన్‌ జోన్స్‌,  ఎస్పీ బాలు మృతికి సంతాపంగా చెన్నై, ఢిల్లీ ప్లేయర్లు బ్లాక్ రిబ్బన్‌‌ని చేతికి ధరించి మ్యాచ్ ఆడుతున్నారు.  టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఢిల్లీ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నారు.  డీన్‌ జోన్స్‌, బాల సుబ్రహ్మణ్యం  స్మారకార్థం  బ్లాక్‌ ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించినట్లు చెన్నై ట్వీట్‌ చేసింది. 


logo