శుక్రవారం 03 జూలై 2020
Sports - May 22, 2020 , 21:28:54

దాదానే స‌రైనోడు.. వ్యాఖ్య‌ల‌పై సీఎస్ఏ త‌ర్జ‌న బ‌ర్జ‌న‌

దాదానే స‌రైనోడు.. వ్యాఖ్య‌ల‌పై సీఎస్ఏ త‌ర్జ‌న బ‌ర్జ‌న‌

-ఐసీసీ చైర్మన్‌గా దాదా సరైనోడన్న స్మిత్‌ వ్యాఖ్యాలపై సీఎస్‌ఏ భిన్న వాదనలు


జొహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా సౌరవ్‌ గంగూలీ సరైనోడు అని క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ గ్రేమ్‌ స్మిత్‌ గురువారం అన్న మాటలపై సీఎస్‌ఏ అధికారులు భిన్నంగా స్పందించారు. అది స్మిత్‌ వ్యక్తిగత అభిప్రాయమని దానికి బోర్డుకు ఎలాంటి సంబంధం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. స్మిత్‌ బాహాటంగా గంగూలీకి మద్దతు తెలపడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పాలుపోని సీఏస్‌ఏ అధ్యక్షుడు క్రిస్‌ నెన్జానీ శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఐసీసీ ప్రొటోకాల్‌ను మేం పాటిస్తున్నాం. దాంతో పాటు మాకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే ఎవరికి మద్దతు తెలపాలో నిర్ణయిస్తాం. ఇప్పటి వరకు ఐసీసీ చైర్మన్‌ పదవికి ఎవరి పేరు నామినేట్‌ కాలేదు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మా క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ మాటపై గౌరవం ఉంది. క్రికెట్‌ను ముందుకు నడిపించే ముఖ్యమైన స్థానానికి నామినేట్‌ అయ్యే వాళ్లెవరో వేచి చూడాలి’ అని అన్నారు. 


logo